: చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగడం మానుకోండి: సినీ 'పెద్ద'లకు తలసాని హెచ్చరిక


టాలీవుడ్ లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చుట్టూ తిరుగుతున్నారని, అది మానుకోవాలని తెలుగు సినీ పెద్దలకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీవాస్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. మేడే సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రాణించడం కష్టమేమీ కాదని అన్నారు. చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్న పద్ధతులను సమూలంగా మారుస్తామని ఆయన చెప్పారు. తెలుగు సినీ నటులు తమను ఇబ్బంది పెట్టకుండా ఉంటే, తాము కూడా బాగా చూసుకుంటామని సూచించారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో ఉందని అంతా గుర్తుంచుకోవాని, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఉందని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణను టీఆర్ఎస్ పరిపాలిస్తోందన్నది అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా పని ఉండదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News