: చెన్నైలోని ఆంధ్రాబ్యాంకుపై బాంబు దాడి
చెన్నైలోని ఆంధ్రా బ్యాంకుపై ఈ రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు బాంబు విసిరి, వెంటనే పారిపోయారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గత నెల శేషాచలంలో తమిళ కూలీలను ఎన్ కౌంటర్ చేసినందుకుగానూ అప్పుడు ఆంధ్రాబ్యాంకుపై ఇలానే దాడి జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి దాడికి ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో తమిళనాడులోని మూడు ఆంధ్రాబ్యాంకులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు.