: ఉగ్రవాదుల చెర నుంచి 160 మందిని రక్షించిన సైన్యం


నైజీరియాలో నరమేధం సృష్టిస్తున్న బొకోహరామ్ తీవ్రవాదుల చెరలో ఉన్న 160 మందిని రక్షించినట్టు ఆ దేశ సైన్యం ప్రకటించింది. దేశంలోని సంబిశా అటవీ ప్రాంతంలో తీవ్రవాదుల వద్ద బందీలుగా వీరు ఉన్నట్టు తెలుసుకుని సైన్యం దాడులు జరిపిందని, రక్షించిన వారిలో 100 మంది బాలికలు, 60 మంది మహిళలు ఉన్నారని సైన్యం తెలిపింది. గతంలో వీరిని వివిధ ప్రాంతాల నుంచి కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్లారని, వీరిని బానిసలుగా మార్చి తమ అవసరాలు తీర్చుకుంటున్నారని వివరించారు. కొందరిని తమ లైంగిక అవసరాలకు వాడుతూ, మరికొందరిని ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి విధ్వంసాలకు కుట్ర పన్నారని తెలిపారు. తమ మాట వినని వారిని అందరిముందూ కాల్చి చంపి ఇతర మహిళలను భయపెడుతున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News