: థియేటర్ల ముందు కమల్ అభిమానుల వీరంగం
తమ అభిమాన నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రాన్ని కావాలనే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చెన్నైలోని థియేటర్ల ఎదుట అభిమానులు వీరంగం సృష్టించారు. సినిమా చూసేందుకు ఉదయం నుంచే క్యూ కట్టిన అభిమానులు ప్రదర్శన లేదని తెలుసుకుని కోపంతో ఊగిపోయారు. కమల్ నటించిన ప్రతి చిత్రం విడుదల సమయంలో ఇటువంటి చర్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. తమిళనాట పలు ప్రాంతాల్లో థియేటర్ల వద్ద అభిమానులు అద్దాలు పగులగొట్టి ఫర్నీచర్ ను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. కాగా, నేడు 1500 థియేటర్లలో విడుదల కావాల్సిన 'ఉత్తమ విలన్' చిత్రం ఆర్థిక కారణాలతో ఆగిపోయిన సంగతి తెలిసిందే.