: అవును తప్పు చేశాం... అమెరికా కోర్టులో అంగీకరించిన ముగ్గురు భారతీయులు


విద్యార్థి వీసాలు, ఆర్థిక సహాయం విషయంలో తాము తప్పుచేశామని అమెరికా కోర్టులో ముగ్గురు భారతీయులు తప్పు ఒప్పుకున్నారు. వీరు తమ కుంభకోణంతో 8 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 50 కోట్లు) మేరకు లాభాలను ఆర్జించారన్నది ప్రధాన అభియోగం. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధీనంలోని హోమ్ లాండ్ సెక్యూరిటీస్ ఇన్వెస్టిగేషన్స్ దీర్ఘకాలం పాటు ఈ కేసును దర్యాప్తు చేసి మే 2014లో నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో సురేష్ హీరానందనే (61), లలిత్ చాబ్రియా (54), అనితా చాబ్రియా (50)లను ప్రధాన నిందితులుగా చూపిన విచారణ సంస్థ సమీర్ హీరానందనే, సీమా షాలు వీరికి సహాయపడ్డారని చార్జ్ షీట్ లో పేర్కొంది. కేసు మన్ హటన్ ఫెడర్ కోర్టులో విచారణకు రాగా సురేష్ హీరానందనే, చాబ్రియాలు తమ తప్పు ఒప్పుకున్నారు. కాగా, వీరికి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకూ జైలుశిక్ష పడుతుందని సమాచారం. ఈ సంవత్సరం సెప్టెంబరులో తీర్పు వెలువడుతుందని అంచనా.

  • Loading...

More Telugu News