: విశాఖ పాస్ పోర్టు పరిధిలోకి కృష్ణా, గుంటూరు జిల్లాలు
కృష్ణా, గుంటూరు జిల్లాలు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం ఈ నెల 11 నుంచి విశాఖపట్నం పాస్ పోర్టు కార్యాలయం పరిధిలోకి రానున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కేంద్రం ఈ మార్పులు చేసినట్టు విశాఖ పాస్ పోర్టు అధికారి ఎల్.ఎల్.పీ చౌదరి తెలిపారు. ఈ మూడు ప్రాంతాల ప్రజలు పాస్ పోర్టుల కోసం ఇకనుంచి విజయవాడ పాస్ పోర్టు సేవాకేంద్రం లేదా విశాఖపట్నం కేంద్రంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి విశాఖ పాస్ పోర్టు కార్యాలయం పాస్ పోర్టులను జారీ చేస్తుందని వివరించారు.