: నేపాల్ లో 6,200కు చేరిన భూకంప మృతుల సంఖ్య


నేపాల్ భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగూతూనే ఉంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6,200కు చేరింది. 13,900 మందికి గాయాలయ్యాయి. కాగా ఖాట్మండులో నిరంతరం కొనసాగుతున్న సహాయక చర్యల్లో 128 గంటల తరువాత సజీవంగా ఓ మహిళ బయటపడింది. సహాయ సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా ఆ మహిళను గుర్తించారు. మరోవైపు నేపాల్ లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విదేశాంగ కార్యదర్శి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ లు అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News