: మా ఉద్యోగులకు వేతనాలివ్వాలి... కోర్టును వేడుకున్న సహారా


సుప్రీంకోర్టు కోరినట్టుగా రూ. 5 వేల కోట్లు సమీకరించి డిపాజిట్ చేస్తామని, అంతకన్నా ముందు కోర్టు అధీనంలో ఉన్న మిగులు నిధిని విడుదల చేయాలని సహారా గ్రూప్ అభ్యర్థించింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సి వుందని, ఇతర ఖర్చులున్నాయని వేడుకుంది. ఈ మేరకు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ, ఆస్తులను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే నిధుల సమీకరణ పూర్తవుతుందని వివరించింది. కాగా, మార్చి 24న కోర్టు 90 రోజుల సమయాన్ని మంజూరు చేస్తూ, ఈ లోగా డబ్బు కట్టకుంటే ఆస్తుల విక్రయ బాధ్యతలు తామే స్వీకరిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న మూడు హోటళ్లు, ఇతర ఆస్తులను సహారా విక్రయానికి ఉంచింది. సహారా తాజాగా దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ కేసును మే 8కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గత సంవత్సరం మార్చి 4 నుంచి సహారా అధినేత సుబ్రతారాయ్ జైల్లో కాలం గడుపుతూ వున్నారు. ఆయనకు బెయిలు రావాలంటే సహారా సంస్థ కోర్టుకు రూ. 5,120 కోట్లను డిపాజిట్ చేయాల్సి వుంది.

  • Loading...

More Telugu News