: హైకోర్టు విభజనపై మధ్యాహ్నం తుది తీర్పు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు విభజనపై ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తుది తీర్పు వెల్లడికానుంది. విభజనపై ఇరు రాష్ట్రాలు, కేంద్రం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఎవరి హైకోర్టు వాళ్లకు ఏర్పాటు చేయాలంటూ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఒత్తిడి చేస్తూ వస్తోంది. దాంతో ఏపీ కూడా తమకూ విడిగా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. అంతేగాక న్యాయస్థానం విభజనపై ఓ పిటిషన్ దాఖలవడంతో విచారణ జరిగింది.