: పశ్చిమబెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం... వధూవరులు సహా 12 మంది మృతి
పశ్చిమబెంగాల్ లోని అలిపురుద్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అందులో ఉన్న పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు సహా 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 18 మందికి గాయాలవగా వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.