: మంచు వారింట డ్యాన్స్ చేయనున్న రజనీకాంత్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో వారింట ఏర్పాటు చేసిన 'సంగీత్'లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ నృత్యాలతో అలరించనున్నారట. మొత్తం ఐదు రోజుల పాటు సాగే 'సంగీత్' వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్, కన్నడ నటుడు అంబరీశ్ లతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలూ పాల్గొంటారని సమాచారం. 'సంగీత్'కు మనోజ్ సోదరి లక్ష్మి యాంకరింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లో ఇందుకోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 14 నుంచి వివాహ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.