: 'క్రాంతివీర సంగోలి రాయన్న'గా మారిన బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్


బెంగళూరు నగర రైల్వేస్టేషన్ పేరును మార్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇకపై బెంగళూరు సిటీ స్టేషన్ ను 'క్రాంతివీర సంగోలి రాయన్న'గా పిలవనున్నారు. రైల్వే స్టేషన్ పేరు మార్పుపై కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తగు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటీష్ పాలకులను ఎదురొడ్డి నిలిచి పోరాడిన సంగోలి రాయన్న పేరు తరతరాలకూ గుర్తుండేలా, సిటీ స్టేషన్ కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, గత సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర సర్కారు పలు పట్టణాల పేర్లను కూడా మార్చింది.

  • Loading...

More Telugu News