: 10వ తేదీన రాహుల్ గాంధీకి ఆతిథ్యమివ్వనున్న నిర్మల్... పాదయాత్రకూ ఏర్పాట్లు!


తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 11వ తేదీన పరామర్శించనున్నారు. టీపీసీసీ వర్గాల సమాచారం ప్రకారం 10వ తేదీన హైదరాబాదుకు వచ్చే ఆయన రాత్రికి నిర్మల్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. ఆపై 11న 'ఆత్మగౌరవ పాదయాత్ర' చేస్తారని, ఆరుగురు మృతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తారని తెలుస్తోంది. ఆయన పర్యటన షెడ్యూల్ మరో రెండు రోజుల్లో అధికారికంగా ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో నియోజకవర్గం నుంచి 200 మంది వరకూ కార్యకర్తలు రాహుల్ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News