: కోట్లాది రూపాయల విలువైన వజ్రాల పట్టివేత


ముంబై నుంచి బ్యాంకాక్ వెళుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 3 కోట్లకు పైగా విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ బంబానియా అనే వ్యక్తి 6,975 క్యారెట్ల వజ్రాలను ఎటువంటి పత్రాలూ లేకుండా దేశాన్ని దాటించేందుకు యత్నించాడు. తనిఖీల్లో అతని వద్ద వజ్రాలు లభించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు వివరించారు. పట్టుబడిన వజ్రాల విలువ రూ. 3.28 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News