: వీళ్ల దెబ్బకు ఎంతమంది క్రికెటర్ల కెరీర్లు నాశనమయ్యాయో!: రాహుల్ ద్రవిడ్
నిబంధనలు పాటించకుండా బౌలింగ్ చేస్తున్న వారి కారణంగా ఎంతో మంది యువ క్రికెటర్ల కెరీర్లు నాశనమయ్యాయని మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి బౌలర్లపై నిషేధం విధించే దిశగా బీసీసీఐ, ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన సమర్థించాడు. సునీల్ నరైన్ వేసే ఆఫ్ స్పిన్ బంతులపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై స్పందించాలని ద్రవిడ్ ను కోరగా, తాను ఎవరి పేర్లనూ వ్యక్తిగతంగా చెప్పనని, అయితే, నియమావళిని అతిక్రమించి బౌలింగ్ చేసే వారిని పక్కన పెట్టడమే మంచిదని అన్నాడు. దీంతో, కొత్త తరం క్రికెటర్లు సరైన దిశలో నడిచే అలవాటును ముందు నుంచే నేర్చుకుంటారని అన్నారు. యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఎదిగేందుకు సహకరించాలని, అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించాడు.