: ఏంటీ, మీ 'మత' గోల?: మోదీ సర్కారుపై ఒత్తిడి తేనున్న అమెరికా!
అధికార బీజేపీ నేతలు చేస్తున్న మతపరమైన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో పెరిగిపోవడంతో, దీన్ని అరికట్టాలని అమెరికన్ సంస్థ ‘ది యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్' (యూఎస్‌ఈఐఆర్‌ఎఫ్) తన తాజా నివేదికలో అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఇండియాలో ద్వైపాక్షిక సంబంధాల్లో 'మత స్వాతంత్య్రం' అంశాన్ని కూడా చేర్చాలని సూచించింది. ముఖ్యంగా మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తన నేతలను బహిరంగంగా చీవాట్లు పెట్టేలా భారత్ పై ఒత్తిడి తేవాలని కోరింది. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ తదితర సంస్థలు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని, ఇది ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు తయారు చేసిన నివేదికను యూఎస్ ప్రభుత్వానికి అందించింది. కాగా, ఈ నివేదికను విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ కొట్టిపారేశారు. ఈ నివేదికను తాము గుర్తించబోమని స్పష్టం చేశారు.