: 'ఐటా'లో సత్తా చాటిన శ్రీవల్లి రష్మిక


అహ్మదాబాద్‌లో జరుగుతున్న ‘ఐటా’ జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం శ్రీవల్లి రష్మిక సత్తా చాటుతోంది. నిన్న జరిగిన అండర్-14 బాలికల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆమె 5-4 (5/2), 4-2తో మేఘారాయ్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. మరోవైపు బాలుర అండర్-16 సింగిల్స్ విభాగంలో తెలంగాణ కుర్రాడు రాచకొండ శ్రీవత్స 4-1, 4-1 తేడాతో అతర్వ శర్మపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర పోటీల్లో అండర్-14 ప్రీ క్వార్టర్స్‌ లో రిత్విక్ చౌదరి 4-1, 4-1తో కుషాన్ షాపై, అండర్-16 విభాగంలో ఎ.కె.రోహిత్ 2-4, 5-4, 4-2తో డానిష్ అహ్మద్‌ పై విజయం సాధించి టెన్నిస్ లో తెలుగు రాష్ట్రాల పేరును నిలబెట్టారు.

  • Loading...

More Telugu News