: పగ తీర్చుకున్న కోల్ కతా!
ఐపీఎల్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను సొంత గడ్డపై 7 వికెట్ల తేడాతో ఓడించి కోల్ కతా గత మ్యాచ్ ఓటమికి పగ తీర్చుకుంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఒక్క బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ రస్సెల్ అద్భుత బ్యాటింగ్ కు తోడు, రాబిన్ ఊతప్ప సమయోచిత బ్యాటింగ్ తో కోల్ కతా విజయభేరి మోగించింది. ఆండ్రీ రస్సెల్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 52), రాబిన్ ఊతప్ప(58 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్ తో 80) పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. జట్టు విజయానికి దోహదపడ్డ ఆండ్రీ రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.