: అణువిద్యుత్ లో 13వ స్థానంలో భారత్
అణువిద్యుత్ ఉత్పాదక దేశాల్లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. పవర్ రియాక్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అణువిద్యుత్ ఉత్పత్తి కోసం అత్యధిక అణు రియాక్టర్లు ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుతం భారత్ లో ఉన్న అణు విద్యుత్ రియాక్టర్ల సామర్థ్యం 5,780 మెగావాట్లు ఉండగా, ఈ సామర్థ్యం 2019 నాటికి 10,080 మెగావాట్లకు చేరుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ వివరాలను ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు వెల్లడించారు.