: స్మిత్, రైనా అవుట్...మెక్ కల్లమ్ బాదుడు షురూ


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, స్మిత్, మెక్ కల్లమ్ బ్యాటింగ్ ప్రారంభించారు. స్మిత్ ను కుమ్మిన్స్ బలిగొనడంతో ఒక్క పరుగుకే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రైనా (8)ను చక్కటి బంతితో యాదవ్ పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో మెక్ కల్లమ్ కు పూనకం వచ్చింది. టాప్ ప్లేయర్స్ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో కోల్ కతా బౌలర్లపై మెక్ కల్లమ్ విరుచుకుపడ్డాడు. కేవలం 11 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో 32 పరుగులు చేశాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News