: ముంబై మెట్రో ప్రయాణం అద్భుతం: శ్రుతి హాసన్


సినీ నటి శ్రుతి హాసన్ ముంబై మెట్రోను ఆకాశానికెత్తేసింది. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె ముంబైలోని మెట్రో రైలులో ప్రయాణించడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ముంబైలోని ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకునేందుకు శ్రుతి హాసన్ ముంబై మెట్రోలో ప్రయాణం చేసింది. ఈ ఉదయం ముంబైలో మెట్రో రైల్లో ప్రయాణం చేశానని, ఆ ప్రయాణం తనను ఆకట్టుకుందని ఆమె ట్వీట్ చేసింది. తల్లిదండ్రులు వెనకేసిన కోట్లాది రూపాయల సంపాదనకు తోడు, త్రిభాషా నటిగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న శ్రుతి మెట్రో రైల్ ప్రయాణంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News