: శ్రీకాళహస్తిలో శ్రీదేవి సందడి... కుమార్తెతో కలిసి పూజలు
అలనాటి అందాల తార శ్రీదేవి గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి విచ్చేశారు. కుమార్తె జాహ్నవితో కలిసి శ్రీదేవి ఇక్కడి ముక్కంటిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆమె సర్పదోష నివారణ పూజలతో పాటు రాహుకేతు పూజలు కూడా నిర్వహించారు. శ్రీకాళహస్తికి వచ్చిన శ్రీదేవిని, ఆమె తనయను చూసేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే కీడు తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే, సెలబ్రిటీలు తమ కెరీర్ అభ్యున్నతిని కోరుతూ ఇక్కడికి వస్తుంటారు.