: అత్యాచారం వీడియోను అంతర్జాలంలో పెట్టిన రేపిస్ట్ దొరికాడు


సమాజంలోని యువత రోజురోజుకీ విచక్షణ కోల్పోతున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనులు చేసి, అవేవో ఘనకార్యాలైనట్టు వాటిని ప్రచారం చేసుకుని మురిసిపోయే దుస్థితికి దిగజారిపోతున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దానిని చిత్రీకరించి, అంతర్జాలంలో పెట్టిన ఘటనలో ఓ యువకుడిని హర్యానాలోని మీవత్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై జరిగిన దాష్టీకం వీడియోపై స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దారుణానికి తెగబడ్డ కీచకుల్లో ఒకడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ సామూహిక అత్యాచారంలో ఏడుగురు పాలుపంచుకున్నారని, మిగిలిన ఆరుగుర్ని పట్టుకుని కటకటాల్లోకి నెడతామని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు చేపట్టినట్టు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News