: నేపాల్ ను తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం
భూకంపం బారినపడి విలవిల్లాడుతున్న హిమాలయ దేశం నేపాల్ ను ఆర్థిక సంక్షోభం తరుముకొస్తోంది. భూకంపం కారణంగా రాజధాని ఖాట్మండూ సహా దేశంలోని అత్యధిక భూభాగం తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో, దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా బాసిల్లుతున్న పర్యాటక, వ్యవసాయ రంగాలు భారీగా ప్రభావితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేపాల్ ఆదాయంలో అత్యధిక శాతం ఈ రెండు రంగాల ద్వారానే లభిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో, నేపాల్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోకతప్పదని 'అసోచామ్' పేర్కొంది. ముఖ్యంగా, దేశ జీడీపీలో 8 శాతానికి పైగా ఆదాయం సమకూరుస్తున్న టూరిజం రంగంపై ప్రభావం మిక్కిలిగా ఉంటుందని తెలిపింది.