: వాళ్లిద్దర్నీ తోసేసిన బస్సు మాదే...సారీ: పంజాబ్ సీఎం
ఈ ఉదయం పంజాబ్ లోని ఓ ప్రైవేటు బస్సులో అమ్మాయిని లైంగికంగా వేధించి, అడ్డం వచ్చిన తల్లిసహా బాలికను బస్సులోంచి తోసేయగా, బాలిక మరణించిన ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఖండించారు. అయితే, ఆ బస్సు తమ కుటుంబ కంపెనీకి చెందినదేనని ఆయన అంగీకరించారు. అయినా సరే, నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్గాలు మోగాలో నిరసన ప్రదర్శన చేశాయి. ఈ దారుణానికి పాల్పడ్డది బస్సు డ్రైవర్, అతని స్నేహితులని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. మిగిలిన వారిని అరెస్టు చేయాల్సి ఉంది. గాయపడ్డ బాలిక తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.