: జైలుపాలు చేసిన సినిమా ఫార్ములా


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు సినీ ఫార్ములాను నిజజీవితంలో అన్వయించడానికి ప్రయత్నించి తన్నులు తిన్నాడు. వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లా బలియా గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ మౌర్య అనే యువకుడు అల్లాహ్ పూర్ గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ గాఢత పెరగడంతో 15 రోజుల క్రితం వీరిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. వారిని పట్టుకున్న యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయించారు. దీంతో సినిమాల్లోలా పెళ్లి మండపంలోంచి యువతిని తీసుకెళ్లిపోవాలని ప్రియుడు ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో యువతి వేషం వేసుకుని కల్యాణ మండపానికి చేరుకున్నాడు. యువతి వేషంలో వచ్చిన ప్రేమికుడిని పట్టుకున్న యువతి బంధువులు, వాడికి రెండు తగిలించి, బంధించి పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రియురాలు కాపురానికి, ప్రియుడు జైలుకి తరలారు.

  • Loading...

More Telugu News