: సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆ హోటల్ ఖాళీ చేసేందుకు 20 ఏళ్లు పట్టింది
శ్రీనగర్ లో చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి రెండు దశాబ్దాల క్రితం జమ్మూకాశ్మీర్ లో అడుగుపెట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్న సెంటార్ లేక్ వ్యూ హోటల్ ను ఖాళీ చేశాయి. 1990 తరువాత జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు పేట్రేగిపోయారు. వారిని అదుపు చేసేందుకు కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు శ్రీనగర్ లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న సెంటార్ లేక్ వ్యూ హోటల్ ను స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి నుంచి భద్రతా బలగాలు ఆ హోటల్ ను వినియోగించుకుంటున్నాయి. తాజా వరదల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పీడీఎఫ్-బీజేపీ ప్రభుత్వం, ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టింది. దీంతో మంచి వ్యూ కలిగిన సెంటార్ లేక్ వ్యూని ఖాళీ చేయించి, పర్యాటకులకు కేటాయించి ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హోటల్ ను ఖాళీ చేయాలని భద్రతా బలగాలను ఆదేశించింది. దీంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది రెండు దశాబ్దాల తరువాత హోటల్ ను ఖాళీ చేశారు.