: టీవీ నటి అస్మితకు వేధింపులు... ఇద్దరు పోకిరీలను అరెస్ట్ చేసిన షీటీమ్స్
హైదరాబాదులో కారులో వెళ్తున్న వర్ధమాన టెలివిజన్ నటి అస్మితను ఇద్దరు పోకిరీలు అసభ్యకర సైగలతో వేధించగా, ఫోటోలు తీసిన అస్మిత వాటిని షీటీమ్స్ ఫేస్ బుక్ పేజీలో పెట్టింది. దీనిపై స్పందించిన షీటీమ్స్ వారు బహదూర్ పురాకు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అస్మిత తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్ట మీదుగా కారులో వెళుతున్న సమయంలో ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు చేతులతో సైగలు చేయడం ప్రారంభించారు. దీంతో కలత చెందిన అస్మిత, ధైర్యం తెచ్చుకుని వారిని తన సెల్ ఫోన్లో బంధించడం ప్రారంభించింది. అయినప్పటికీ, వారు ఆగలేదు. మరింతగా సైగలు చేస్తూ, హేళన చేశారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న అస్మిత వారిని గురించి షీ టీమ్స్ నిర్వహిస్తున్న ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేశారు. మహిళలు ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే ధైర్యంగా స్పందించాలని ఈ సందర్భంగా అస్మిత సూచించారు.