: బాలీవుడ్ పై సుస్మితా సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బాలీవుడ్ పై మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన బెంగాల్ సినిమా 'నిర్భాక్' (మూగ) రిలీజ్ సందర్భంగా కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమలో నటీనటులంతా చెడిపోయారని చెప్పింది. యావద్దేశంలోని నటీనటులతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావించే తాను, బాలీవుడ్ లో మాత్రం చెడిపోయామని చెప్పక తప్పదని తెలిపింది. చూసేందుకు బాగానే కనిపించినా, అంతగొప్పగా ఏమీ ఉండమని ఆమె పేర్కొంది. సుస్మిత వ్యాఖ్యలు సినీ పరిశ్రమపై నెలకొన్న ఎన్నో అపోహలు నిజమనిపించేలా ఉండడం విశేషం.