: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంటికి రానివ్వని భర్త
ఆడపిల్ల ఇంటి దీపం అని, ఇంటికి మహాలక్ష్మి అని చెప్పే మాటలు ప్రజల మనసుల్లోకి వెళ్లడం లేదు. హైదరాబాదులోని రాంనగర్ లో ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త భార్యను ఇంట్లోకి రానివ్వని సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి. మగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు రావాలని వారు మండిపడ్డారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, భర్తపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు.