: పార్కింగ్ స్థలం కోసం అమెరికా మహిళల సిగపట్లు... నెట్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో
మంచినీటి కోసం ట్యాంకర్ల ఎదుట మన మహిళల సిగపట్లు మనకు కొత్తేమీ కాదు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో అసలు గొడవ పడేందుకు ఏమాత్రం ఆస్కారం లేని చిన్న వివాదంలో ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఫైట్ లో బొద్దుగా ఉన్న మహిళ, బక్క పలుచగా ఉన్న మహిళను కింద పడేసి, ఆపై మీద కూర్చుని ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. ఈ గొడవను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టేశాడు. ప్రస్తుతం నెట్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే... న్యూయార్క్ కు చెందిన వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ ఎదుట ఆదివారం తన కారును పార్కింగ్ చేసేందుకు 24 ఏళ్ల లటోయియా సిద్ధపడింది. తన కారు పార్కింగ్ కోసం ఎంచుకున్న స్థలాన్ని మరో వ్యక్తి కాస్త ముందుగా వచ్చేసి ఆక్రమించుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించి లటోయియాపై సదరు వ్యక్తి భార్యామణి త్వానా మోరెల్ వాదనకు దిగింది. అంతేకాక లటోయియాను కిందపడేసి మీద కూర్చుని ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఇక భార్యను ఆపాల్సిన ఆ వ్యక్తి అందుకు విరుద్ధంగా మరింత రెచ్చిపొమ్మని పురమాయించాడట. నెట్ లో వీడియో హల్ చల్ చేస్తుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారిస్తున్నారు.