: మెక్ డొనాల్డ్స్ పై 6.3 లక్షల డాలర్ల జరిమానా విధించిన చైనా


ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ చైన్ రిటైల్ ఔట్ లెట్లను నిర్వహిస్తున్న మెక్ డొనాల్డ్స్ చైనా జాయింట్ వెంచర్ పై ఆ దేశ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నీటిని కలుషితం చేస్తున్నందుకు రికార్డు స్థాయిలో 3.9 మిలియన్ యువాన్ లు (6.3 లక్షల డాలర్లు - సుమారు రూ. 4 కోట్లు) జరిమానా విధించింది. బీజింగ్ నగరంలో కలుషితాలను కారణంగా చూపుతూ ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే తొలిసారని అధికార న్యూస్ ఏజన్సీ క్సిన్హువా వెల్లడించింది. ఇటీవలి కాలంలో చైనా ప్రభుత్వం జాతీయ స్థాయిలో వాయు, నీటి కాలుష్యాలు నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టి, భారీగా జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News