: బీసీల సమస్యలపై మేలో చలో ఢిల్లీ కార్యక్రమం: ఆర్.కృష్ణయ్య


బీసీల సమస్యలపై మే 5,6,7 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా బీసీ బిల్లుపై మాట్లాడటం లేదన్నారు. బీసీ బిల్లుకు మద్దతుగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖలు రాయాలని కోరారు. బీసీ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, కల్యాణలక్ష్మీ, మూడెకరాల భూ పంపిణీ పథకాలను బీసీలకూ వర్తింపజేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News