: అనంత జిల్లాలో మరో కలకలం... బాంబులు స్వాధీనం


నిన్న వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి దారుణ హత్యతో అట్టుడికిన అనంతపురం జిల్లాలో... ఈ రోజు మరో కలకలం చెలరేగింది. తాడిపత్రి మండలం హుస్సేనాపురం గ్రామ శివార్లలోని చెట్ల పొదల్లో బాంబులను కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే వారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు 20 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి నకిలీ బాంబులని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News