: మోదీ సర్కారుపై అమెరికా నజర్... ఏపీలో మతహింసపై విచారం


మూడు దశాబ్దాల తర్వాత భారత్ లో నరేంద్ర మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా, ఏడాది తిరక్కముందే విమర్శల జడివాన కురిపించింది. భారత్ లో ఘర్ వాపసీ, మైనారిటీలపై పెరుగుతున్న దాడులు తదతరాలపై విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ‘యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం’ 2015 ఏడాదికి సంబంధించిన నివేదికలో భారత్ లో జరుగుతున్న మతమార్పిడిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పెచ్చరిల్లుతున్న మత హింసపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బలవంతపు మత మార్పిడులు జరిగాయని నిందించింది. అధికార పార్టీ బీజేపీ అనుబంధ సంస్థలు ఆరెస్సెస్, వీహెచ్ పీల ఆధ్వర్యంలోనే ఈ తంతు నడుస్తోందని అమెరికా సంస్థ పేర్కొంది. ఇక మత మార్పిడికి సంబంధించి దేశంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వివాదంపై స్పందిస్తూ మోదీ చేసిన ప్రకటనను మాత్రం ఆ సంస్థ ప్రశంసించడం గమనార్హం.

  • Loading...

More Telugu News