: నరేంద్ర మోదీకి నవాజ్ షరీఫ్ ఫోన్... నేపాల్ కు భారత సహాయంపై పాక్ ప్రధాని ప్రశంసలు


భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య నిత్యం అగ్గిరాజుకుంటున్నా, నేటి ఉదయం నవాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ కు అన్ని దేశాల కంటే ముందు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఈ విషయంలో భారత సహాయక చర్యలను ప్రస్తావిస్తూ అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు మోదీని అభినందిస్తూ సందేశాలు పంపాయి. తాజాగా బద్ధ శత్రువు పాకిస్థాన్ నుంచి కూడా మోదీ ప్రశంసలు అందుకున్నారు.‘‘నేపాల్ కు మీరు అందిస్తున్న సహాయం అమోఘం’’ అంటూ నవాజ్ షరీఫ్, మోదీని ఆకాశానికెత్తేశారు.

  • Loading...

More Telugu News