: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో నేనెలాంటి అవినీతికి పాల్పడలేదు: దాసరి


కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు క్షేత్రాల కేటాయింపుల్లో తానెలాంటి అవినీతికి పాల్పడలేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఈ స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్ధ తాజాగా దాఖలు చేసిన చార్జ్ షీటులో తన పేరు పేర్కొనడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎవరి నుంచి కూడా సెంటు భూమి తీసుకోలేదని, ఎవరి నుంచి ఏవిధమైన లాభం పొందలేదని చెప్పారు. రాజకీయాల్లో వివాదం సహజమేనని దాసరి ముక్తాయించారు. గత నెలలో దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలో రూ.2.25 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయన తనకేం సంబంధలేదన్నట్టుగా స్పందించారు.

  • Loading...

More Telugu News