: దుర్గగుడి గోశాలలో మరణించిన ఆవుల సంఖ్య 16


విజయవాడ పాతబస్తీలోని అర్జున వీధిలో ఉన్న దుర్గగుడి గోశాలలో చనిపోయిన ఆవుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న తొమ్మిది ఆవులు చనిపోగా, ఈరోజు ఉదయం ఏడు ఆవులు మృతి చెందాయి. దాంతో మరణించిన ఆవుల సంఖ్య మొత్తం 16కు చేరింది. కాగా మరో 14 ఆవుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గడువు ముగిసిన బొంబాయిరవ్వ ఆవులకు పెట్టడం వల్లే చనిపోతున్నాయని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆవులకు పశువైద్యులు వైద్యం చేస్తున్నారు. అటు ఈ ఘటనపై విచారణ చేయాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోశాలకు రవ్వను పంపిణీచేసిన భవానీ ట్రేడర్స్, సాంబశివరావు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News