: వెనక్కితగ్గిన మోదీ సర్కారు... భూసేకరణ బిల్లు ఇప్పట్లో రానట్టే!


వివాదాస్పద భూసేకరణ బిల్లుపై మోదీ సర్కారు వెనక్కితగ్గింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మరో ఐదు పనిదినాలు మాత్రమే పనిచేయనున్న నేపథ్యంలో, వచ్చే వారంలో చర్చ చేపట్టాల్సిన బిల్లుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వీటిల్లో భూసేకరణ బిల్లు లేదు. దీంతో ఈ సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. భూసేకరణ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లులనూ కేంద్రం ఆపింది. వీటిల్లో బాల నేరస్తుల వయసు పరిమితి సవరణ, రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లు, నల్లధనం బిల్లు, జీఎస్ టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లు తదితరాలను పెండింగులో పెట్టింది. వాస్తవానికి జీఎస్ టీ బిల్లుపై మే 5న చర్చించి ఓటింగ్ జరుపుతామని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించినప్పటికీ, ఈ బిల్లుపై మరింత చర్చ జరపాలని భావిస్తున్న నేపథ్యంలో సమయం చాలదని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News