: కాలినడకన వెళ్తూ రైతులతో మమేకమౌతున్న రాహుల్
దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగిన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 15 కిలోమీటర్ల 'సంవాద్ పాదయాత్ర' ఈ ఉదయం ప్రారంభమైంది. అమరావతి సమీపంలోని గుంజి గ్రామం నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన ఆయన రైతులతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు. మొత్తం ఐదు గ్రామాల మీదుగా ఆయన నడక సాగనుండగా, పలువురు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెంట నడుస్తున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ, నిన్న పార్లమెంటులో మోదీ సర్కారును రాహుల్ ఎండగట్టిన సంగతి తెలిసిందే.