: దూసుకుపోతున్న లోకేశ్... వచ్చే నెల 7న ఒబామాతో భేటీ!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ దూసుకెళుతున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ యాత్రల పేరిట ఆయన మరింత క్రియాశీలకంగా మారారు. తాజాగా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం అమెరికా పర్యటనకు వెళుతున్న ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలతో పాటు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన ఒబామాతో భేటీకి అనుమతి కూడా సాధించారు. వచ్చే నెల 3 నుంచి 12 దాకా అమెరికాలో పర్యటించనున్న లోకేశ్, వచ్చే నెల 7న ఒబామాతో భేటీ కానున్నారు. ఈ మేరకు ఈ భేటీకి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.