: భర్త బలాత్కరిస్తే అది అత్యాచారం కాదు!: కేంద్రం స్పష్టీకరణ
వైవాహిక సంబంధంలో ఉన్న ఇద్దరి మధ్య జరిగే బలవంతపు కలయికను అత్యాచారంగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. భర్త బలవంతంగా అనుభవిస్తే, అది అత్యాచారం (రేప్) కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్ లో ఉందని గుర్తు చేస్తూ, దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? అని డీఎంకే సభ్యురాలు కనిమోళి వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి సమాధానమిచ్చారు. భార్యకు ఇష్టం లేకుండా బలవంతపెడితే, అది విదేశాల్లో నేరమని, భారత్ లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్ గా నిర్వచించలేమని, చట్ట సవరణ ఆలోచనేమీ తాము చేయడం లేదని హరిభాయ్ వెల్లడించారు. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే, ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, ఇండియాలో కుటుంబ విలువలకు ఇది విఘాతమని వెల్లడించారు.