: వెనుకబడిన జిల్లాకు ఎవరూ రారు... ఆదిలాబాదులో వైద్యుల కొరతపై టీ మంత్రి వ్యాఖ్య!


గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు చర్యలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా వైద్యవిద్య పూర్తి చేసుకునే విద్యార్థులు కొంతకాలం పాటు విధిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధన అమలవుతోంది. అయితే ఆదిలాబాదు లాంటి వెనుకబడిన జిల్లాకు చెందిన పట్టణాల్లో ఇప్పటికీ వైద్యుల కొరత వేధిస్తోంది. దీనిని సరిచేయలేరా? అన్న మీడియా ప్రశ్నలకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి విచిత్రంగా స్పందించారు. ‘‘ఆదిలాబాదు జిల్లా వెనుకబడిన జిల్లా. ఇక్కడ పనిచేయడానికి వైద్యులు ఎవరూ రారు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాను దిగ్భ్రాంతికి గురి చేశాయి.

  • Loading...

More Telugu News