: అనుష్కను ప్రేమించడానికి గల కారణాలను కోహ్లీ చేప్పేశాడు!


టీమిండియా వైస్ కెప్టెన్, జట్టులో స్టార్ బ్యాట్స్ మన్ గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య గాఢమైన ప్రేమ బంధం ఏర్పడింది. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం వీలు చిక్కినా అనుష్క అక్కడ వాలిపోతోంది. ఆపై ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, అనుష్కతో మాత్రం చాలా కూల్ గా ఉంటాడట. అయినా ఆమెలో ఏం నచ్చి అంతలా ప్రేమిస్తున్నారంటూ అడిగితే, కోహ్లీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారణం చెప్పేశాడు. తనలాగే అనుష్క కూడా నిజాయతీపరురాలని, అందుకే ఆమె అంటే చాలా ఇష్టమని అతడు పేర్కొన్నాడు. ‘‘షి ఈజ్ లవ్లీ. సింపుల్ పర్సన్. నాలాగే ఆమె కూడా నిజాయతీపరురాలు. ఆ లక్షణాలే నన్ను ఆమె వైపునకు తిప్పుకుంటున్నాయి. అందుకే ఆమెను అంతగా ప్రేమిస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వివరించాడు.

  • Loading...

More Telugu News