: క్యాప్ జెమిని డీల్ ఎఫెక్ట్... అశోక్ వేమూరి సంపద రూ.120 కోట్లు పెరిగింది


ఒకే ఒక్క డీల్ తో 'ఐగేట్' సీఈఓ అశోక్ వేమూరి సంపద విలువ దాదాపు రూ.120 కోట్ల మేర పెరిగిపోయింది. ఆశ్చర్యంగా ఉన్నా, అశోక్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయంతో ఆయన సంపద అనూహ్యంగా పెరుగుతోంది. ఐగేట్ ను టేకోవర్ చేయనున్నట్లు ప్రకటించిన క్యాప్ జెమిని, ఒక్కో ఐగేట్ షేరుకు 48 డాలర్లను వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అశోక్ వేమూరి వద్ద 4 లక్షల మేర ఐగేట్ షేర్లున్నాయి. ఈ షేర్లకు క్యాప్ జెమినీ 1.9 కోట్ల డాలర్ల(రూ.120 కోట్లు)ను చెల్లించాల్సి ఉంది. గతేడాది అశోక్ తన వద్ద ఉన్న ఐగేట్ షేర్ల నుంచి 18,750 లను విక్రయించారు. ప్రస్తుతం అవి కూడా అశోక్ వద్ద ఉండి ఉంటే, ఆయన సంపద విలువ మరో 19 శాతం పెరిగేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Loading...

More Telugu News