: కేసీఆర్ సొంత జిల్లాలో సర్కారీ కార్యాలయంలో ఉద్యోగుల మందు పార్టీ!


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత జిల్లా మెదక్ లో అధికారులు జల్సాల్లో మునిగితేలుతున్నారు. అందుకు సర్కారీ కార్యాలయాలనే వేదికగా ఎంచుకుంటున్నారు. నిన్న రాత్రి జిల్లాలోని జోగిపేట పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు తమ కార్యాలయంలోనే అర్ధరాత్రి దాకా మందు, విందులతో ఎంజాయ్ చేశారు. విషయాన్ని గమనించి చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై మద్యం మత్తు తలకెక్కిన ఉద్యోగులు దాడికి యత్నించారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని మీడియాతో రాజీకి వచ్చే యత్నం చేశారు. ఈ క్రమంలో విందు మాత్రమే చేసుకున్నామని, మందుపార్టీ చేసుకోలేదని బుకాయించే యత్నం చేశారు.

  • Loading...

More Telugu News