: పేషెంట్లను గుర్తించేందుకు 'భూకంపం' స్టిక్కర్లంటించారు!


భారత్ లోనూ భూకంపం బారిన పడిన ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 50కి పైగా నమోదైంది. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో భూకంప బాధితుల నుదుటన అంటించిన స్టిక్కర్లు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ స్టిక్కర్లపై 'భూకంప్' అని రాసి ఉంది. కార్డియాలజీ విభాగంలో హడావుడిగా ఏర్పాటు చేసిన వార్డులో వైద్య సిబ్బంది భూకంప బాధితులను గుర్తించేందుకు ఈ స్టిక్కర్లంటించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ శంకర్ ఝా వివరణ ఇస్తూ... ఇది భారీ తప్పిదమని పేర్కొన్నారు. అలా స్టిక్కర్లంటించాలని తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అటు, భూకంప సహాయ చర్యల ఇన్ చార్జి మంత్రి బైద్యనాథ్ సాహ్ని ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. డాక్టర్ శంకర్ ఝాతో తాను మాట్లాడానని, ఆ స్టిక్కర్లు వెంటనే తొలగించాలని సూచించానని తెలిపారు.

  • Loading...

More Telugu News