: ఏబీ దూకుడు... బెంగళూరు 11 ఓవర్లలో 93/2


రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తుండడంతో బెంగళూరు జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. డివిల్లీర్స్ 46, మన్ దీప్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విధ్వంసక బ్యాట్స్ మన్ గేల్ 10 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ కోహ్లీ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లు సౌథీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో జరుగుతోంది.

  • Loading...

More Telugu News