: టీఆర్ఎస్ నేతలు పరుగో పరుగు
టీఆర్ఎస్ నేతలపై తేనెటీగలు పగబట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న నేతలను పరుగులు పెట్టించిన తేనెటీగలు మరోసారి దాడి చేశాయి. నిజామాబాద్ జిల్లా బిచ్ కుంద మండలంలోని చీకోటివానికుంటలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వెళ్లారు. ఆయన మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు ఉపక్రమిస్తుండగా, సమీపంలోని చింతచెట్టుమీద ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. దీంతో నేతలు, కార్యకర్తలు పరుగందుకున్నారు. తేనెటీగల దాడిలో ఓ కార్యకర్త, మరో హోంగార్డు గాయపడ్డారు.