: కలరా భయంతో హడలిపోతున్న నేపాల్... మాస్క్ లు ధరించాలంటున్న వైద్యులు
నేపాల్ లో భూకంపం సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా శిథిలాలు... వాటిని తొలగిస్తే శవాలు! భూకంపం వచ్చి రోజులు గడుస్తుండడంతో ఇంకా తొలగింపుకు నోచుకోని మృతదేహాలు కుళ్లి కంపు కొడుతున్నాయి. ఛిద్రమైన అవయవాలతో శవాలు భీతిగొలుపుతున్నాయి. ఖాట్మండూలోని పలు వీధులు కుళ్లిన శవాలు వెదజల్లే దుర్గంధం కారణంగా నిర్మానుష్యంగా మారిపోయాయి. పారిశుద్ధ్య లేమి కారణంగా కలరా ప్రబలుతుందేమోనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక కార్యక్రమాలు మరికొన్ని రోజులు కొనసాగించనున్నారు. కూలిన భవనాల కింద ఇంకా శవాలు ఉండడంతో, వెలికితీత చర్యలు ముమ్మరం చేశారు.